: చంద్రబాబు ప్రమాణోత్సవ ఏర్పాట్లు సమీక్షిస్తున్న గుంటూరు కలెక్టర్
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భద్రతకు 10 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.