: పిల్లల్ని ఈనిన కోడి...!


కోడి ఈనడం ఏమిటి పిచ్చి కాకపోతే అనిపిస్తోంది కదా... కానీ ఇది నిజం! మన రాష్ట్రంలోనే రౌతులపూడి అనే గ్రామంలో ఈ తమాషా చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో ఓ కోడిపెట్ట రెండు పిల్లల్ని ప్రసవించింది. అయితే ఈ రెండు పిల్లలు తల్లిలోంచి బయటకు వచ్చిన వెంటనే చనిపోయాయి. స్థానికంగా పశువైద్యాధికారి మాత్రం.. చిన్న లోపాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అన్నారు.

కాల్షియం భాస్వరం లేకపోవడం వల్ల గుడ్డు పెంకు ఏర్పడకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తమాషా ఏంటంటే.. మామూలుగా పెంకు ఏర్పడి గుడ్డు బయటకు వచ్చిన తర్వాత కూడా కోడి దాన్ని మూడు వారాల పాటు పొదిగితేనే.. పిల్ల బయటకు వస్తుంది. అలాంటిది కడుపులోనే ఎలా పొదిగిందనేది తమాషా. అలాగే కోడి రోజుకు ఒక గుడ్డే పెడుతుంది కదా.. రెండు పిల్లల్ని ఎలా ఈనింది అనేది మరో తమాషా!

  • Loading...

More Telugu News