: విశాఖ ఫ్యాషన్ షోపై మంత్రి ఆగ్రహం
విశాఖపట్నంలో ఫ్యాషన్ షో ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందాల ప్రదర్శన పేరుతో అశ్లీలతను చూపుతున్నారని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం మహిళలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టాయి. దీంతో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే, మహిళా సంఘాలపై పోలీసుల కఠిన వైఖరిని మంత్రి గంటా శ్రీనివాస్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసభ్యకరంగా ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తుంటే వెంటనే అడ్డుకోవాలనీ, ఎవరినీ ఉపేక్షించవద్దని ఆయన సూచించారు. కాగా, ఈ ఫ్యాషన్ షో విశాఖలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతుంది.