: కలసి పనిచేసేందుకు ఇది ముందడుగు: చంద్రబాబు
కేసీఆర్ ను ప్రమాణ స్వీకారోత్సవానికి స్వయంగా ఆహ్వానించానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలు కలసి పని చేసేందుకు ఇది ముందడుగుగా ఉపయోగపడుతుందని అన్నారు. 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య నేతలు, జాతీయ పార్టీల నేతలను ఆహ్వానించానని బాబు చెప్పారు. రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలను కూడా ఆహ్వానించానని బాబు వెల్లడించారు.