: జగన్ కు చంద్రబాబు ఆహ్వానం
ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు పలువురికి ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్, లోక్ సత్తా అధ్యక్షుడు జేపీ, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పంపారు. అయితే, జగన్ కు స్వయంగా ఫోన్ చేసి పిలిస్తే బాగుంటుందని చంద్రబాబుకు కొందరు టీడీపీ నేతలు సూచించినట్టు సమాచారం.