: కేసీఆర్ కు ఫోన్ చేసిన చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంగా పదవీ బాధ్యతలను చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 8న జరిగే తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అలాగే ప్రధాని మోడీ, దేశంలోని 11 మంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులకు కూడా చంద్రబాబు ఆహ్వానాలు పంపారు. వీరితో పాటు దేశంలోని అన్ని జాతీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు. వీరందరికీ చంద్రబాబు స్వయంగా లేఖలు రాశారు.