: రాహుల్ తో రఘువీరా, చిరంజీవి భేటీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి ఢిల్లీలో ఇవాళ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై వీరు రాహుల్ తో చర్చించారు. సాయంత్రం 4.30కి రఘువీరా, చిరంజీవి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు.