: రాష్ట్రంలో గజదొంగలు పడ్డారు
రాష్ట్రంలో గజదొంగలు పడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒకప్పుడు భారత దేశాన్ని పాలించిన బ్రిటీష్ వాళ్ళు డబ్బు, నగలే దొంగిలించారని, ఇప్పుడు రాష్ట్రంలో పడ్డ దొంగలు ఏకంగా భూములనే కొట్టేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బాబు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దోపిడీ దొంగల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే కష్టాల్లో పడతారని పరోక్షంగా వైఎస్ కుటుంబాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. రోజూ చంచల్ గూడ జైలుకు వెళుతున్న నాయకులు ఈ కోవకే చెందుతారని బాబు విపులీకరించారు.