: తెలంగాణ ప్రజలకు వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కలిసి శ్రమిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. తెలంగాణకు కేంద్రం పూర్తిగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.