: ప్రతిపక్ష నేత కుర్చీకోసం కాంగ్రెస్ లో పోటీ!


సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత... లోక్ సభ లో ప్రతిపక్ష నేత స్థానం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రమైంది. దీన్ని సోనియా చేపట్టాలని సత్యవ్రత చతుర్వేది వంటి సీనియర్ నేతలు కొందరు కోరుతుండగా... మరికొందరు మాత్రం యువరాజు రాహుల్ గాంధీ ఆ పదవిని అలంకరించాలని ఆశిస్తున్నారు. దీనికి తోడు కమల్ నాథ్, వీరప్ప మొయిలీ వంటి వారు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. నిజానికి లోక్ సభలో ప్రతిపక్షంగా గుర్తింపు పొందడానికి సరిపడా (54) స్థానాలు కాంగ్రెస్ కు లేవు. కాంగ్రెస్ కు కేవలం 44 స్థానాలే ఉన్నాయి. తమకు చాలినన్ని స్థానాలు లేకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ ఏఐడీఎంకే, బీజేడీతో జట్టుకట్టి ప్రతిపక్ష స్థానాన్ని సొంతం చేసుకుంటుందేమోనన్న ఆందోళన కూడా కాంగ్రెస్ ను పట్టి పీడిస్తోంది.

  • Loading...

More Telugu News