: తెలంగాణ రాజముద్రలో అమరవీరుల స్థూపం ఎందుకు లేదు?: రేవంత్ రెడ్డి
తెలంగాణ అధికారిక చిహ్నంలో అమరవీరుల స్థూపం ఎందుకు లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలను చిన్నవి చేసేందుకే స్థూపం పెట్టలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అమరవీరుల స్థూపాన్ని అధికారిక చిహ్నంలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.