: దళితులకిచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారు: రేవంత్ రెడ్డి
దళితులకిచ్చిన హామీని కేసీఆర్ కాలరాశారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్ లోని 12 మందిలో ముగ్గురు ఆయన కుటుంబానికి చెందిన వారేనని రేవంత్ అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ ఒక్క మంత్రి పదవినీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఆస్తులను పంచుకున్నట్లు మంత్రి పదవులను పంచుకున్నారని ఆయన కేసీఆర్ పై ధ్వజమెత్తారు.