: అఖిలేష్ యాదవ్ నివాస ముట్టడికి బీజేపీ ప్రయత్నం


ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా యూపీలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి నివాస ముట్టడికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ఉపయోగించారు.

  • Loading...

More Telugu News