: ఏడీబీ గవర్నర్ల బోర్డులో అరుణ్ జైట్లీ
ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) గవర్నర్ల బోర్డులో సభ్యుడిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నియమితులయ్యారు. ఆయన నియామకం మే 27 నుంచి అమల్లోకి వస్తుంది. అంతకు ముందు పి.చిదంబరం ఈ స్థానంలో ఉన్నారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఉన్న 1.7 బిలియన్ల పేదల జీవన ప్రమాణాలను పెంచడానికి ఏడీబీ కృషి చేస్తుంది.