: బావ, బావ మరిది... బావ, మరదలు యుద్ధంతో ఆసక్తిగా మారిన మహారాష్ట్ర
మహారాష్ట్రలో రాజకీయం రసకందాయంలో పడింది. బావ (ఉద్ధవ్ ఠాక్రే), బావమరిది (రాజ్ ఠాక్రే)... బావ (అజిత్ పవార్), మరదలు (సుప్రియా సూలే) మధ్య వివాదం మారాఠా గడ్డపై ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే ప్రకటించారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా తానేనని ఆయన స్పష్టం చేశారు.
దీంతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉద్ధవ్ ఠాక్రేయేనని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్, కుమార్తె సుప్రియా సూలే మధ్య ఆసక్తికర సమరం నడుస్తోంది. పార్టీలో పెత్తనంపై వీరిద్దరూ విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.