: రాజకీయ అవినీతిని పెకిలించినప్పుడే రాష్ట్రాభివృద్ధి: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం సాకారమైన ఈ శుభ తరుణంలో రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేసీఆర్ చెప్పారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజా ఉద్యమాల విజయం, అమర వీరుల త్యాగ ఫలమే తెలంగాణ అని, తెలంగాణ ఏర్పాటులో అన్ని వర్గాలూ భాగస్వాములేనని ఆయన అన్నారు. రాజకీయ అవినీతిని పెకిలించినప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. రాజకీయ అవినీతి అంతానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేసీఆర్ అన్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా క్షమించేది లేదని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన ఉంటుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News