: వాషింగ్టన్ లో వరుస పేలుళ్ల నిందితుడు అరెస్ట్


అమెరికాలోని వాషింగ్టన్ లో థియేటర్ల వద్ద ఇటీవలి కాలంలో వరుస బాటిల్ బాంబు పేలుళ్లకు పాల్పడుతున్న అనుమానిత నిందితుడు మాన్యూల్ జాయ్ నెర్(20) ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాంబుల తయారీతోపాటు మేరీలాండ్ లోని సినిమా థియేటర్ లో గత నెల 24న పేలుళ్లకు పాల్పడినట్లుగా అతడిపై అభియోగాలు నమోదు చేసినట్లు అగ్నిమాపక విభాగం అధికారి ప్రిన్స్ జార్జ్ తెలిపారు. ఈ ప్రాంతంలోని పలు థియేటర్లలో వరుసగా బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇతడేనని అనుమానిస్తున్నారు. అయితే, ఏ ఒక్క ఘటనలోనూ ఎవరూ గాయపడలేదు. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్ తో ఈ ప్రాంతంలోని థియేటర్ల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News