: కేసీఆర్ కు అభినందనలు తెలిపిన బొత్స
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కు మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభినందనలు తెలిపారు. దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసుకున్నందుకు తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి శుభాభినందనలు తెలియజేశారు.