: కేసీఆర్, వైఖరి మార్చుకో... బాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తాం: ఎర్రబెల్లి


కేసీఆర్, టీఆర్ఎస్ ల వైఖరిపై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించకపోవడంపై విరుచుకుపడ్డారు. వ్యక్తిగతంగా ఆహ్వానించకుండా... కనీసం ఒక బృందాన్నైనా పంపించకుండా చంద్రబాబును ఆహ్వానించామని కేసీఆర్ చెప్పడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. అందరికీ పంపినట్టుగా ప్రభుత్వం ద్వారా లేఖ పంపి తమ అధినేతను అవమానించారని మండిపడ్డారు. ఇంత జరిగినా తమ గౌరవాన్ని, హోదాను తాము కాపాడుకుంటామని... ఈ నెల 8న జరిగే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పిలుస్తారని చెప్పారు. అంతే కాకుండా కొంత మంది నేతలం ఒక బృందంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానిస్తామని తెలిపారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఇకనైనా తమ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News