: విశాఖలో 'పవిత్ర' ఆడియో రిలీజ్


శ్రియ వేశ్య పాత్రలో నటిస్తున్న చిత్రం 'పవిత్ర'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. జనార్దన మహర్షి దర్శకత్వంలో ఆదేశ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సాధక్ కుమార్, మహేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోజా, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, ఏవీఎస్, రవిబాబు, కౌశిక్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఈ సాయంత్రం జరిగిన ఆడియో లాంచింగ్ కార్యక్రమంలో ప్రధాన పాత్రధారి శ్రియ, దర్శకుడు మహర్షి, సాయికుమార్, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News