: ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ పిలిచి ఉంటే గౌరవంగా ఉండేది: చంద్రబాబు


ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి కేసీఆర్ ఆహ్వానించకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ ఆహ్వానించి ఉంటే గౌరవంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలుగు జాతిలో విద్వేషాలు ఉండరాదని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో విద్యుత్, నీటితో పాటు పలు సమస్యలున్నాయని... వాటి పరిష్కారానికి సహకరించాలని కేంద్రాన్ని కోరానని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం టీడీపీ కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. మీకోసం పాదయాత్రలో తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసుకున్నానని... అందుకే తెలంగాణకు మద్దతుగా కేంద్రానికి లేఖ ఇచ్చానని తెలిపారు.

  • Loading...

More Telugu News