: ఒక్క మహిళకూ చోటు దక్కలే!
తెలంగాణలో కేసీఆర్ సారథిగా తొలి ప్రభుత్వం కొలువుదీరింది. కేసీఆర్ తో పాటు 11 మంది మంత్రులగా ప్రమాణం చేశారు. కానీ, వారిలో ఒక్కరంటే ఒక్క మహిళకూ చోటు దక్కలేదు. అయితే, వారంలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అప్పుడు మహిళలకు చోటు దక్కుతుందని చెబుతున్నాయి.