: ఇండియన్స్ తో సూపర్ కింగ్స్ మ్యాచ్ షురూ.. సచిన్ డకౌట్
ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్ గా బరిలో దిగిన సచిన్ (0) మొదటి ఓవర్ ఐదో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక. ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టుకు తాజా సీజన్ లో ఇదే తొలి మ్యాచ్. కాగా, రెండో మ్యాచ్ ఆడుతున్న ముంబయి ఇండియన్స్.. తన తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.