: గన్ పార్క్ నుంచి రాజ్ భవన్ బయలుదేరిన కేసీఆర్
గన్ పార్కులో అమరవీరులకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్ భవన్ కు బయలుదేరారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, మంత్రివర్గంలో చేరనున్న సహచరులు, పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు చేరుకున్నారు.