: బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ
తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ, తొలి డీజీపీగా అనురాగ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అనురాగ్ శర్మ మాట్లాడుతూ, తెలంగాణ తొలి డీజీపీగా బాధ్యతలను స్వీకరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ కు అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు.