: 8.15 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా ఈ ఉదయం 8.15 గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో కేసీఆర్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు టీఆర్ఎస్ నేతలు, ఉన్నతాధికారులు హాజరవుతారు. మధ్యాహ్నం 12.57 గంటలకు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.