: బీజేపీ ఆఫీసుకు వచ్చిన మోడీ
ప్రధాని మోడీ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ రోజు కొద్దిగా సమయం దొరకడంతో వచ్చినట్టు తెలిపారు. అంతేకాకుండా పార్టీకి చెందిన ప్రధాన నేతలతో ఆయన సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై ప్రజలంతా ఆశలు పెట్టుకొని ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అందరూ ఏకాభిప్రాయంతో ఉంటేనే దేశంలో మార్పును తీసుకురాగలుగుతామని చెప్పారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించి ప్రపంచం ముందు ఉంచాలని అభిప్రాయపడ్డారు. దీనికోసం యూనివర్శిటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.