: కేసీఆర్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనే వారందరూ దళిత ద్రోహులే: మంద కృష్ణ
రేపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ పై మంద కృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాటను విస్మరించారని ఆరోపించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారాన్ని అన్ని పార్టీలు బహిష్కరించాలని అన్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే వారందరూ దళిత ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపడతామని మంద కృష్ణ తెలిపారు. రేపు ఉదయం పార్సిగుట్ట నుంచి ఇందిరా పార్క్ వరకు నిరసన ర్యాలీ చేపడతామని చెప్పారు.