: ఇక మీదట సినీనటుడు రాజేంద్రప్రసాద్.. 'విశ్వ విశిష్ట నట ప్రవీణ'


నటకిరీటి రాజేంద్రప్రసాద్ ను `విశ్వ విశిష్ట నట ప్రవీణ` బిరుదుతో సత్కరించనున్నామని టీఆర్ఎస్ లలిత కళాపరిషత్ వ్యవస్థాపకులు టీ సుబ్బిరామిరెడ్డి చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈనెల 11న విశాఖ రామకృష్ణా బీచ్ లో జరిగే ఉగాది వేడుకల్లో ఈ పురస్కారం ప్రదానం చేస్తామని తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలాఉండగా, 2011-12 సంవత్సరానికి టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులకు ఈనెల 20న జాతీయ పురస్కారాలు ప్రదానం చేస్తామని టీఎస్సార్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News