: 'టీజీ' వద్దు 'టీఎస్' కావాలన్న కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిధిలోని వాహనాల రిజిస్ట్రేషన్ కు 'టీజీ' సిరీస్ ను కేంద్రం కేటాయించింది. అయితే తమకు 'టీజీ' వద్దని 'టీఎస్' కావాలని కేసీఆర్ కోరారు. దీంతో మళ్లీ దాన్ని మార్చే పనిలో కేంద్ర అధికారులు పడినట్టు సమాచారం. తెలుగు అక్షరాల్లో 'స' అక్షరాన్ని కేసీఆర్ శుభకరంగా భావిస్తారని... అందుకే 'స' శబ్దం ధ్వనించేలా 'ఎస్' ఉండాలని కేసీఆర్ కోరినట్టు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు 'టీఎస్' అంటే తెలంగాణ స్టేట్ అనే రీతిలో కూడా ఉంటుందని కేసీఆర్ భావించారట. సోమవారం నాడు దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.