: ఆంధ్రప్రదేశ్ సీఎస్, డీజీపీలు వీరే


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీగా జేవీ రాముడు నియమితులయ్యారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే... ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మహంతి ఈ రోజు పదవీ విరమణ పొందుతున్నారు. ఈయన స్థానంలో ఐవైఆర్ కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రానికి సీఎస్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సాయంత్రం 7 గంటలకు కృష్ణారావు బాధ్యతలను చేపడతారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ఏపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

  • Loading...

More Telugu News