: పేద ఖైదీల కోసం 'కోర్ట్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్': జస్టిస్ కట్జూ


సంవత్సరాల తరబడి జైలుశిక్ష అనుభవిస్తున్న పేద ఖైదీలను బయటకు తీసుకువచ్చేందుకు 'కోర్ట్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్' పేరుతో ఓ స్వచ్ఛంధ సంస్థను స్థాపించనున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తెలిపారు. దీనికి హాలీ నారిమన్ ను అధ్యక్షుడిగా చేయనున్నట్లు చెప్పారు.

'మారుతున్న కాలంలో ఉర్దూభాష- తీరు తెన్నులు' అనే అంశంపై హైదరాబాద్ జూబ్లీహాల్లో ఈరోజు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కట్జూ, ముఖ్యమంత్రి కిరణ్ సహా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కట్జూ.. రాష్ట్రంలో సంస్కృతం, ఉర్ధూ భాషలను విద్యార్ధులకు తప్పనిసరి చేయాలని కోరారు. ఈ విషయంపై తన ప్రసంగంలో స్పందించిన సీఎం, తెలుగు మహాసభల్లాగే ఉర్దూ మహాసభలు నిర్వహిస్తే ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News