: కువైట్ యువరాణితో మైకేల్ జాక్సన్ తనయుడి ప్రేమాయణం!
పాప్ రారాజు, దివంగత మైకేల్ జాక్సన్ తనయుడు ప్రిన్స్ మైకేల్ ఇప్పుడు ప్రేమ పల్లవులు ఆలపిస్తున్నాడు. కువైట్ యువరాణి రెమి అల్ఫలాహ్ తో జూనియర్ జాక్సన్ మాంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్పప్పుడు ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ లాస్ ఏంజెల్స్ లోని ఓ బౌలింగ్ సెంటర్ వద్ద ఊసులాడుకుంటున్నప్పుడు కెమెరాలకు చిక్కారట. అనంతరం వారిద్దరూ ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్ యూవీ)లో ఆమె నివాసానికి వెళ్ళిపోయారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రస్తుతం పదహారేళ్ళ ప్రాయంలో ఉన్న ప్రిన్స్ మైకేల్ కు రెమి హైస్కూల్లో జూనియర్ అని తెలుస్తోంది.