: పోలవరంపై ఒడిశా ఎంపీలతో కలసి పోరాటం: కడియం శ్రీహరి
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై ఒడిశా, ఛత్తీస్ గఢ్ ఎంపీలతో కలసి లోక్ సభలో పోరాడుతామని టీఆర్ఎస్ ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్ తెలిపారు. ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతున్నట్లు తెలంగాణ బిల్లులో లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.