: రాహుల్ ప్రజలతో మమేకం కాలేకపోయారు: కేరళ హోంమంత్రి


ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతల నుంచి మొదలైన విమర్శల జడివాన ఆగేట్లు లేదు. ఇప్పటికే పలువురు నేతలు రాహుల్ ను తప్పుబట్టగా... తాజాగా కేరళ హోం మంత్రి రమేశ్ చెన్నితాల కూడా వారిలో చేరిపోయారు. రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం కాలేకపోయారని, ఆయన యువజన కాంగ్రెస్ కోసమే ఎక్కువ పనిచేశారని చెన్నితాల విమర్శించారు. దీంతో రాహుల్ కు దేశంలోని మిగతా ప్రాంతాల వారికి మధ్య అంతరం నెలకొందన్నారు. రాహుల్ సోదరి ప్రియాంక రాజకీయాల్లోకి రావాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News