: అమెరికా సైనికుడిని విడుదల చేసిన తాలిబన్లు


ఆఫ్ఘనిస్థాన్ లో ఐదేళ్ల పాటు తమ కస్టడీలో ఉంచుకున్న బోయే బెర్గ్ దాల్ (28) అనే అమెరికా సైనికుడిని తాలిబన్లు విడుదల చేశారు. అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అతడిని వదిలిపెట్టారు. ఒప్పందంలో భాగంతా అమెరికా ఆధీనంలో ఉన్న ఐదుమంది తాలిబన్లను విడుదల చేయాలి. గ్వాంటనమో బేలో ఉన్న బంధీలను అమెరికా కతార్ కు అప్పగించింది. ఈ వ్యవహారంలో కతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. బోయేను మంచి ఆరోగ్యంతో తాలిబన్లు విడుదల చేశారు. యుద్ధ భూమిలో ఏ ఒక్క అమెరికన్ ను కూడా వదిలివేయమని ఈ ఘటనతో అమెరికా చాటి చెప్పిందని ఆ దేశాధ్యక్షుడు ఒబామా అన్నారు.

  • Loading...

More Telugu News