: నల్లధనంపై ఏర్పాటైన సిట్ తొలి భేటీ రేపు
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఏర్పాటైన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) రేపు తొలిసారిగా భేటీ కానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సిట్ ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.బి.షా ప్రత్యేక దర్యాప్తు బృందానికి సారథ్యం వహిస్తారు. 11 ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాలతో సిట్ ఏర్పాటయింది. ఇందులో కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, సీబీఐ, ఐబీ, రా, ఈడీ డైరెక్టర్లు ఉంటారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ లు సహాయ సహకారాలు అందిస్తారు.