: ఐఏఎస్ అధికారులతో చంద్రబాబు భేటీ
కాబోయే సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, పలువురు ఇతర ఐఏఎస్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రేపటి నుంచి ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ఏర్పడే సమస్యలు, వాటికి పరిష్కారాలు తదితర అంశాలపై చంద్రబాబు అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే, విభజన తీరును కూడా అధికారులు చంద్రబాబుకు తెలియజేసినట్లు తెలుస్తోంది.