: వచ్చే 48 గంటల్లో అధిక ఉష్ణోగ్రతలు


రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఛత్తీస్ గడ్ నుంచి కోస్తాంద్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్నిచోట్ల, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడతాయని, వీటి వల్ల ఈదురుగాలులు వీస్తాయని తెలియజేసింది.

  • Loading...

More Telugu News