: పోలీసులకు చిక్కిన 240 మంది ఎర్రచందనం స్మగ్లర్లు


చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం వృక్షాలను కబళిస్తున్న 240 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి తమిళనాడుకు స్మగ్లర్లు బయల్దేరారన్న సమాచారంతో పోలీసులు రేణిగుంట రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి నుంచి రైళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 240 మంది పట్టుబడ్డారు. వారిని తిరుపతి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తిరుమల శేషాచలం అడవులతోపాటు తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల్లో స్మగ్లర్ల కోసం కూంబింగ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు హతమయ్యారు.

  • Loading...

More Telugu News