: నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సీఎస్ ల నియామకం
అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నియామకం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సీఎస్ గా ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణకు రాజీవ్ శర్మలను నియమించనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ఈ రోజు పదవీ విరమణ చేయనుండటంతో ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు సీఎస్ ల నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి.