: ఏపీ ఆదాయం 52 వేల కోట్లు...ఖర్చు 62 వేల కోట్లు...లోటు 10 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ఆదాయం 52 వేల కోట్ల రూపాయలని అధికారులు తేల్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యయం మాత్రం 62 వేల కోట్ల రూపాయలని అధికారులు తెలిపారు. దీంతో లోటు బడ్జెట్ 10 వేల కోట్ల రూపాయలు అని తేలింది. మరో వైపు పంపకాల్లో అప్పు 93 వేల కోట్ల రూపాయలు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా వ్యయం 7,600 కోట్ల రూపాయలు కాగా, సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 28 వేల కోట్ల రూపాయలు. కేంద్రం నుంచి పన్ను రాబడి 13,462 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 10 నెలలకు 70,295 కోట్ల రూపాయలని అధికారులు వివరించారు.