: సీఎల్పీ నాయకుడెవరో తేల్చాల్సింది సోనియా గాంధీయే!


తెలంగాణలో సీఎల్పీ నాయకుడు ఎవరో తేల్చాల్సింది సోనియా గాంధీయేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. హైదరాబాదులోని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో సోనియా గాంధీ బహిరంగ సభ విజయవంతం కాకపోవడానికి కారణం అంతర్గత కుమ్ములాటలేనని తేల్చారు.

పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వడానికి కారణం పార్టీ సహకారం ఆశించినంతగా లేకపోవడమేనని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోవడంతోనే ఓటమిపాలైనట్టు పలువురు నేతలు అంగీకరించారు.

  • Loading...

More Telugu News