: స్వాతంత్ర్యదినోత్సవం స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి: జానారెడ్డి


స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని మాజీ మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, త్యాగం, చెల్లించిన మూల్యంపై ప్రతి కార్యకర్త ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సోనియా గాంధీ ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విధానం తెలంగాణ యావత్తు ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీని తల్చుకుని తెలంగాణ యావత్తు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News