: సెహ్వాగ్ కుమారుడే వెలకట్టలేని ఆ ఇన్నింగ్స్ కు ప్రేరణ
ఐపీఎల్ చరిత్రలోనే గుర్తుండిపోయే మ్యాచ్ నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ బెర్తు కోసం జరిగింది. భారత విధ్యంసకర బ్యాట్స్ మన్ సెహ్వాగ్ రెచ్చిపోవడం వెనుక ఆయన కుమారుడున్నాడు. సెహ్వాగ్ తన కుమారుడితో మాట్లాడేందుకు ఫోన్ చేసిన సందర్భంగా ఆర్యవీర్ మాట్లాడుతూ "ఎందుకు డాడీ, ఊరికే అవుటవుతున్నావు? మీ డాడీకి పరుగులు చేయడం చేతకాదు అంటూ స్కూల్ లో నా స్నేహితులు గేలి చేస్తున్నారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
దానికి సమాధానంగా సెహ్వాగ్ తప్పకుండా భారీ స్కోరు చేస్తానని కుమారుడికి మాటిచ్చాడు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ సెహ్వాగ్ చెన్నైతో జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేసి కేవలం 58 బంతుల్లోనే 122 పరుగులు చేసి తానేంటో నిరూపించాడు. దీంతో పంజాబ్ సునాయాసంగా గెలుస్తుందని భావించినా రైనా దూకుడుతో చెన్నై గట్టిపోటీ ఇచ్చింది.