: ఉద్యోగుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోంది: పీవీ రమేష్
ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి 9,893 మంది ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించామని అన్నారు. ఉద్యోగుల పంపిణీని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఉండవన్న ఆయన, ఎక్కడి ఉద్యోగులు అక్కడే పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఏ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే పెన్షన్లు చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు.