: బీబీసీ తీరుపై సిగ్గుపడుతున్నాం: బ్రిటన్ ఎంపీ ప్రీతిజైన్
మే 16న ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీవైపు చూస్తున్నా, బీబీసీ సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బ్రిటన్ భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆమె బీబీసీ డైరెక్టర్ జనరల్ లార్డ్ టోనీ హాల్ కు లేఖ రాశారు. ప్రపంచం మొత్తం భారత ప్రధానిపై దృష్టి కేంద్రీకరించినా బీబీసీ ఆయనకు సరైన ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదని లేఖలో ఆమె ప్రశ్నించారు.
మోడీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇంగ్లాండ్ లో ఉన్న భారతీయులు తనకు ఫిర్యాదు చేశారని ఆమె పేర్కొన్నారు. ఫలితాలను వెల్లడిస్తూ యాంకర్ యాల్థా హకీమ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని వివాదాస్పద వ్యక్తిగా అభివర్ణించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యర్థులు మాత్రమే ఆయనను విమర్శించేందుకు అలా అంటారని, ఈ మాట ఉపయోగించడం ద్వారా బీబీసీ నిష్పాక్షికతను వదిలేసి ఆయన రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరించిందని ప్రీతి పటేల్ మండిపడ్డారు.