: రాజకీయ బంద్ లపై హీరోయిన్ కాజల్ ట్వీట్
రాజకీయ పార్టీలు చేసే బంద్ లపై టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ మండిపడింది. ఈ బందుల వల్ల సమయం వృథా కావడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని ట్విట్టర్లో తెలిపింది. ఇకపై రాజకీయ బంద్ లను బంద్ చేయాలని సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరిగిన నేపథ్యంలో కాజల్ ఈ ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్ ప్రజల్లో మార్పు తెస్తుందా? లేక కాజల్ నే సమస్యల్లోకి నెడుతుందా? వేచి చూడాలి.