: బావిలోంచి సింహం గాండ్రింపులు
పెద్దగా గాండ్రింపులు... పొలంలోకి అడుగుపెట్టిన రైతు చెవిన పడ్డాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో అంతుబట్టలేదు. గాండ్రింపులు ఆగలేదు. కొద్ది సేపు రైతు అటూ ఇటూ చూసి చివరికి పొలంలోనే ఉన్న బావిలోకి తొంగిచూశాడు. అడుగున ఎక్కడో ఓ సింహం బిగ్గరగా అరుస్తూ కనిపించింది. వెంటనే అతడు తోటి రైతులకు చెప్పడం వారు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిపోయింది. గుజరాత్ లోని సోమనాథ్ జిల్లా గిరిగిద్ధ గ్రామంలో ఈ ఉదయం ఇది జరిగింది. నిన్న రాత్రి దాహం కోసం వచ్చిందేమో కానీ 60 అడుగుల లోతైన బావిలో ఆడ సింహం పడిపోయింది. మొత్తానికి అటవీ శాఖ సిబ్బంది వచ్చి గంటన్నర శ్రమ పడి దాన్ని బావిలోంచి బయటకు తీశారు.