: అద్నాన్ సమీ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్


ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ ఆస్ట్రేలియా వెళ్లడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. జూలైలో సంగీత ప్రదర్శనకు గాను అద్నాన్ సమీ వెళ్లాల్సి ఉంది. అయితే, తగిన ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ష్యూరిటీలు ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలోనే ఆదేశించినా ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోని అద్నాన్ పై కోర్టు మండిపడింది. తమ ఆదేశాలను తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'సబా గలదారి'ని అద్నాన్ 2001లో పెళ్లి చేసుకోగా... 2004లో విడాకులు తీసుకున్నారు. మళ్లీ తిరిగి 2007లో పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఎంతో కాలం సాగలేదు. మళ్లీ 2009లో విభేదాలతో విడిపోయారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కోర్టుకెక్కారు. అద్నాన్ పై గలదారి 2009లో గృహహింస కేసు పెట్టింది.

  • Loading...

More Telugu News